News April 14, 2025
దండేపల్లిలో మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లిలో జరిగింది. ఎస్ఐ తౌసుద్దీన్ తెలిపిన వివరాలు.. దండేపల్లికి చెందిన గంగాధరి వరలక్మి (38) భర్త వేధింపులు, కుటుంబ కలహాలతో ఆదివారం ఇంట్లో ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరలక్ష్మి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 15, 2025
చిన్నారుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

చిన్నారుల అక్రమ రవాణా విషయంలో UP ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్ నిర్దేశించింది. ఆసుపత్రుల నుంచి నవజాత శిశువులు మిస్సయితే వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆదేశించింది. అక్రమ రవాణా కేసుల ట్రయల్స్‌ను కోర్టులు 6 నెలల్లోగా పూర్తి చేయాలంది. కాగా 2020 నుంచి 36 వేల మంది చిన్నారులు మిస్ అయ్యారని కేంద్రం గత ఫిబ్రవరిలో కోర్టుకు నివేదిక సమర్పించింది.
News April 15, 2025
చిత్తూరు: కిలో 7 రూపాయలే..!

మామిడి సాగుకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ అన్ని రకాల మామిడి పండుతుంది. కానీ రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఓవైపు పూత, దిగుబడి సమస్య వేధిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలు, ఈదురుగాలులు రైతును కకావికలం చేస్తున్నాయి. నిన్న జిల్లాలో వీచిన గాలులకు మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వాటిని మండీలకు తరలిస్తే కేజీకి రూ.7 నుంచి రూ.10 మించి ధర లభించలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
News April 15, 2025
మల్కాపురం: బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మల్కాపురంలో అంగ కృష్ణ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని బాలికతో అసభ్యకరంగా ప్రవరించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.