News January 29, 2025

దండేపల్లి: పొలం దున్నుతుండగా బయటపడ్డ సూర్య చంద్ర విగ్రహాలు

image

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదరిపేటలో శివారులో అద్భుతం చోటు చేసుకుంది. స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ సమీపంలోని పంట పొలంలో బుధవారం పొలం దున్నుతుండగా సూర్య, చంద్ర విగ్రహాలు బయటపడ్డాయి. ఒకేరాయిపై ఈ విగ్రహాలు చెక్కబడి ఉండటం విశేషం. దీంతో విగ్రహాలను చూడటానికి స్థానికులు తరలివస్తున్నారు. విగ్రహాలకు పూజలు చేస్తున్నారు.

Similar News

News February 19, 2026

అనకాపల్లి: రేపు ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్

image

జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 20న ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం తెలిపారు. అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీలను అందజేయవచ్చునన్నారు. జిల్లా అధికారులందరూ హాజరుకావాలని కోరారు.

News February 19, 2026

టెన్త్ పరీక్షలకు వైభవ్ డుమ్మా.. తండ్రి ఏమన్నారంటే?

image

భారత U19 సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ టెన్త్ పరీక్షలకు <<19149713>>హాజరుకాకపోవడంపై<<>> తండ్రి సంజీవ్ స్పందించారు. IPLపై ఫోకస్ చేయడం కోసమే ఎగ్జామ్స్ రాయలేదని చెప్పారు. ‘వైభవ్ తెలివైన విద్యార్థి. గతంలో అన్ని సబ్జెక్టులలో 90% పైగా మార్కులు సాధించేవాడు. కానీ ఇప్పుడు పరీక్షలకు వెళితే ఆటపై ఫోకస్ చేయలేడు. ప్రస్తుతం RR ఆటగాళ్లతో కలిసి నాగ్‌పూర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది పరీక్షలు రాస్తాడు’ అని తెలిపారు.

News February 19, 2026

గర్ణికం: ‘టెన్త్ ఫలితాల్లో జిల్లా మొదటి స్థానానికి కృషి’

image

ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా మొదటి స్థానానికి ఎదిగేందుకు కృషి చేస్తున్నామని అనకాపల్లి జిల్లా డీఈవో అప్పారావు నాయుడు పేర్కొన్నారు. గర్ణికం కేజీబీవీ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షల కోసం ఇచ్చిన 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. గత ఏడాది అనకాపల్లి జిల్లా 5వ స్థానంలో ఉందని.. మొదటి స్థానం సాధించేందుకు సహకరించాలన్నారు.