News November 20, 2025
దక్షిణాఫ్రికాతో వన్డేలకు బుమ్రా, హార్దిక్ దూరం!

దక్షిణాఫ్రికాతో NOV 30 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు బుమ్రా, హార్దిక్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని వీరికి విశ్రాంతి ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. కాగా ఆసియాకప్‌లో గాయపడిన హార్దిక్ కోలుకుంటున్నారు. WC వరకు హార్దిక్ టీ20లపై ఫోకస్ చేస్తారని BCCI వర్గాలు పేర్కొన్నాయి. 2026 FEBలో T20 WC మొదలయ్యే ఛాన్స్ ఉంది.
Similar News
News November 22, 2025
కార్ల వేలానికి ఓకే.. నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాక్

బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఆయనకు సంబంధించి ఈడీ సీజ్ చేసిన 2 కార్లను వేలం వేయడానికి స్పెషల్ జడ్జి జస్టిస్ ఏవీ గుజ్‌రాతీ అనుమతించారు. బెంజ్ GLE250 (39 లక్షలు), స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్ (7.5 లక్షలు) కార్లు వేలం వేసి డబ్బును నేషనలైజ్డ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలన్నారు. సీజ్ చేసిన 3 కార్ల వేలానికి అనుమతి కోరగా రెండింటికే అంగీకరించింది.
News November 22, 2025
మహిళలు గంధం రాసుకునేది ఎందుకంటే?

ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చుట్టాలతో, పెద్దవారితో ఆప్యాయంగా, వినయంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇల్లాలుపై ఉంటుంది. అయితే కొందరు మహిళల మాటతీరు గట్టిగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు అతిథులు ఈ మాటతీరును ఇబ్బందిగా భావిస్తారు. అందుకే గొంతుపై గంధం రాస్తారు. ఇలా రాస్తే గొంతు సరళంగా, సున్నితంగా మారి మాటతీరు తియ్యగా, వినస్రవ్యంగా మారుతుందని నమ్మేవారు. స్త్రీ రూపానికి తగిన మృదువైన స్వరం ఉండాలని ఇలా చేశారు.
News November 22, 2025
కోర్టులో రహస్య చిత్రీకరణపై చర్యలు తీసుకోవాలి: YCP మాజీ MLA

AP: CBI కోర్టు జడ్జి ముందు YS జగన్ నిలబడి ఉండగా రహస్యంగా వీడియో చిత్రీకరించి కుట్రతో వైరల్ చేస్తున్నారని YCP మాజీ MLA సుధాకర్‌బాబు విమర్శించారు. దీనిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ ఎక్కడికెళ్లినా వేలాది మంది వస్తుండడంతో అక్కసుతో ఇలా వ్యక్తిత్వ హననానికి దిగజారారని మండిపడ్డారు. CBN జైల్లో ఉండగా ఫొటోల వంటివీ బయటకు రాకుండా నాటి జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని కాపాడిందన్నారు.


