News December 21, 2025
దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పుల మోత.. 10 మంది మృతి

దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జొహన్నెస్‌బర్గ్‌కు సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు వాహనాల్లో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెలలో ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News January 8, 2026
పురుషులను కుక్కలతో పోల్చిన నటి.. నెటిజన్ల ఫైర్

మగాళ్లను కుక్కలతో పోల్చుతూ కన్నడ నటి రమ్య(దివ్య స్పందన) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కుక్క ఎప్పుడు కరిచే మూడ్‌లో ఉంటుందో ఎవరూ చెప్పలేరు. వాటిని షెల్టర్లకు తరలించాలి’ అన్న <<18789967>>సుప్రీంకోర్టు కామెంట్లపై<<>> ఆమె స్పందించారు. ‘మగాళ్ల మైండ్‌ను కూడా చదవలేం. వాళ్లు ఎప్పుడు రేప్/మర్డర్ చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దీంతో నెటిజన్లు ఫైరవుతున్నారు.
News January 8, 2026
రెండేళ్లలోపే ₹3.02 లక్షల కోట్ల అప్పు: జగన్

AP: 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ₹3,90,247 కోట్ల అప్పు ఉందని వైసీపీ చీఫ్ జగన్ తెలిపారు. ‘మా హయాంలో ₹3,32,671 కోట్ల రుణాలు తీసుకుంటే ₹2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. చంద్రబాబు ఇప్పుడు రెండేళ్లలోపే ₹3,02,303 కోట్ల అప్పు చేశారు. కానీ అదంతా ఏం చేశారో తెలియదు. మేం సంక్షేమానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాబు అప్పులకు క్యాలెండర్ రిలీజ్ చేశారు’ అని ఎద్దేవా చేశారు.
News January 8, 2026
క్రమ పద్ధతిలో హిందువులపై దాడులు: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. అక్కడ మైనారిటీలపై ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని NDTVతో చెప్పారు. ఈ హింసను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అనుమతిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. శిక్ష పడుతుందనే భయం దోషుల్లో లేకుండా పోయిందన్నారు.


