News January 24, 2026
దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి కేకే లైన్ దూరమవుతోందా?

కొత్తవలస-కిరండోల్ మార్గం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి నుంచి తప్పిపోయే ప్రమాదం ఏర్పడింది. కేకే లైన్ ద్వారా ఐరన్ ఓర్, బొగ్గు వంటి కార్గో రవాణాతో జోన్‌కు భారీ ఆదాయం లభిస్తోంది. కొత్తవలస జంక్షన్‌తో పాటు శ్రీకాకుళం జిల్లాలో పలు సెక్షన్లు రాయగడ డివిజన్‌కు వెళ్లే పరిస్థితి తలెత్తుతోంది. రైల్వేలో ఉత్తరాంధ్రపై ఒడిశా ఆధిపత్యం కొనసాగుతుండగా.. ఈ మార్గం కోల్పోతే జోన్ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడుతుంది.
Similar News
News January 29, 2026
మెదక్ జిల్లాలో దారుణ హత్య

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి బండమీదిపల్లి గ్రామానికి చెందిన బాలేశ్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి హత్య చేశారు. అయితే వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News January 29, 2026
కాకినాడ: బాలిక ఫిర్యాదు.. యువకుడు ఆత్మహత్యాయత్నం

బాలికను వేధిస్తున్నాడనే ఫిర్యాదుపై విచారణకు వచ్చిన సతీశ్ అనే యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏడు కాలువల ప్రాంతానికి చెందిన ఇతడు, టిఫిన్ చేసి వస్తానని చెప్పి విషం సేవించి పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో స్టేషన్‌కు చేరుకున్నాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పేరుతో వేధించినట్లు సతీశ్‌పై సదరు బాలిక గతంలో ఫిర్యాదు చేసింది.
News January 29, 2026
మేడారం జాతరలో వనదేవతల సాక్షిగా ప్రసవం..!

వనదేవతల సన్నిధిలో ఓ చిన్నారి కిలకిలరావాలు వినిపించాయి. జాతర దర్శనానికి వచ్చిన మేడ్చల్(D) మౌలాలికి చెందిన రజిత అనే గర్భిణికి గురువారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. DMHO డా.అప్పయ్య పర్యవేక్షణలో, వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.


