News December 24, 2025
దక్షిణ భారత యువజనోత్సవాల్లో ANU విద్యార్థుల ఘన విజయం

చెన్నై వేదికగా జరిగిన దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల యువజనోత్సవ పోటీల్లో ANU విద్యార్థులు మెరిశారు. హిందుస్థాన్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించిన 39వ యువజనోత్సవాల్లో ఫోక్, గిరిజన నృత్యాలు, క్రియేటివ్ కొరియోగ్రఫీ, కాలేజ్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. థియేటర్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. ఈ విజయాలు విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని సమన్వయకర్త ఆచార్య మురళీమోహన్ పేర్కొన్నారు.
Similar News
News December 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 110 సమాధానం

ఈరోజు ప్రశ్న: కర్ణుడి అసలు పేరేంటి? ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ తర్వాత కర్ణుడిలా ఎందుకు మారింది?
సమాధానం: కర్ణుడి అసలు పేరు ‘వసుషేణుడు’. అతను జన్మతః ఒంటిపై బంగారు కవచకుండలాలతో పుట్టడం వల్ల ఆ పేరు వచ్చింది. అయితే ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడగగానే తన ప్రాణాలకు రక్షణగా ఉన్న ఆ కవచ కుండలాలను శరీరం నుండి కోసి (కర్తనం చేసి) దానం చేయడం వల్ల, అతనికి ‘కర్ణుడు’ అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 28, 2025
అక్షరాల కిన్నెరసానిలో.. జ్ఞాపకాల జూబ్లీ!

వనవాస ప్రాంతాల్లో అక్షర జ్యోతులను వెలిగిస్తూ, గిరిజన బిడ్డలను ప్రపంచ స్థాయికి చేర్చిన కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవ సంబరాలు ఆదివారం అంబరాన్నంటాయి. 1975లో స్థాపించబడిన ఈవిద్యాలయం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘గోల్డెన్ జూబ్లీ’ వేడుకలను పూర్వ విద్యార్థులు వైభవంగా నిర్వహించారు. ఈ పాఠశాల ఎంతో మందిని IAS, IPS, శాస్త్రవేత్తలు, వైద్యులుగా తీర్చిదిద్దిందని వారు గుర్తు చేసుకున్నారు.
News December 28, 2025
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలుపొందింది వీళ్లే..

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా అశోక్ కుమార్, సి.కళ్యాణ్, వై.వి.ఎస్.చౌదరి, ప్రసన్న కుమార్, దిల్ రాజు, నాగవంశీ, దామోదర్ ప్రసాద్, మోహన్ వట్లపట్ల, రామసత్యనారాయణ, కె.ఎస్.రామారావు, అమ్మిరాజు, చదలవాడ శ్రీనివాసరావు విజయం సాధించారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలుపొందారు.


