News February 2, 2025

దక్షిణ భారత సైన్సు ఫెయిర్‌లో ములుగు విద్యార్థినుల ప్రతిభ

image

జనవరి 21 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో జరిగిన దక్షిణ భారత సైన్స్ ఫెయిర్‌లో ములుగులోని సాధన హై స్కూల్ విద్యార్థినులు లక్ష్మి ప్రసన్న, గౌతమిలు ప్రతిభ కనబరిచి స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నారు. ములుగు జిల్లా తరఫున ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో నాచురల్ ఫార్మింగ్ థీమ్ చేసిన ఆవిష్కరణకు ఈ గుర్తింపు లభించింది. గైడ్ టీచర్ ప్రణీత్, కరస్పాండెంట్ సురేందర్‌ను డీఈవో పాణిని, డీఎస్ఓ జయదేవ్ అభినందించారు.

Similar News

News March 15, 2025

మెదక్: యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య

image

యువకుడు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ పట్టణం బారా ఇమాంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌కు చెందిన అరవింద్ (26) ఫతేనగర్‌లో ఉంటూ ఆర్టీసీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 15, 2025

ప్రముఖ నటుడు మృతి.. పాడె మోసిన స్టార్ హీరో

image

బాలీవుడ్ నటుడు, ఫిల్మ్ మేకర్ దేబ్ ముఖర్జీ(83) అనారోగ్యంతో <<15756854>>కన్నుమూసిన<<>> విషయం తెలిసిందే. నిన్న ముంబైలో జరిగిన ఆయన అంత్యక్రియలకు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ దేబ్ ముఖర్జీ పాడె మోశారు. ముఖర్జీ కుమారుడు-డైరెక్టర్ అయాన్‌‌, రణ్‌బీర్ క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో తండ్రిని కోల్పోయిన అయాన్‌ను ఓదార్చి, దగ్గరుండి అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.

News March 15, 2025

యాదాద్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి (UPDATE)

image

యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద <<15765722>>రోడ్డుప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తిమ్మాపురం గ్రామానికి చెందిన రమేష్ (34) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!