News March 24, 2025

దక్షిణ మధ్య రైల్వే అధికారులతో బాపట్ల ఎంపీ సమీక్ష 

image

బాపట్ల ఎంపీ, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ సోమవారం ఢిల్లీలో దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలోని 62 లెవెల్ క్రాసింగ్ స్థితిని సమీక్షించారు. ప్రజలు ప్రమాదాలు, అసౌకర్యాలకు గురికాకుండా ఉండటానికి 62 ఆర్ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు ఎంపీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

Similar News

News December 12, 2025

హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్.. ఆరుగురికి 20 ఏళ్ల జైలు

image

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ <<18502408>>కేసులో<<>> ఆరుగురు నిందితులకు కేరళ ఎర్నాకుళం స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో కొన్నాళ్లు జైలు జీవితం గడిపిన నటుడు దిలీప్‌ను ఇటీవలే న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. మిగతా నిందితులైన సునీల్, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజీశ్, సలీమ్, ప్రదీప్‌కు ఇవాళ శిక్ష ఖరారు చేసింది. 2017లో హీరోయిన్‌పై గ్యాంగ్‌రేప్ దేశవ్యాప్తంగా సంచలనమైంది.

News December 12, 2025

పోలియో నిర్మూలనకు సమన్వయమే కీలకం: DRO

image

పోలియో నిర్మూలన కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఏక మురళి శుక్రవారం ఆదేశించారు. జిల్లా రెవెన్యూ కార్యాలయంలో పల్స్ పోలియోపై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు అందించాలన్నారు. ఇటుక బట్టీలు, వలస కుటుంబాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

News December 12, 2025

కాకుమాను: సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా నక్కల ఆగస్టీన్

image

కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత నక్కల ఆగస్టీన్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు ఆగస్టీన్ ధన్యవాదాలు తెలిపారు. ఆగస్టీన్ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.