News February 24, 2025
దగదగలాడుతున్న కేతకి సంగమేశ్వర ఆలయం

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఝరసంగంలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈనెల 24 నుంచి మార్చి 3వ తేదీ వరకు దేవాలయ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 26న అగ్ని ప్రతిష్ఠ, మహా హోమం, ప్రత్యేక అభిషేకాలు, రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహా అభిషేక పూజా కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2025
శ్రీశైలంలో నేడు పుష్ప పల్లకీ సేవ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో నేడు శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకీ సేవను నిర్వహించనున్నారు.పూజా కార్యక్రమాలు ఇలా..◆ ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు◆ ఉదయం 9 గంటలకు రుద్రహోమం, చండీహోమం◆ సాయంత్రం 5.30 గంటలకు సాయంకాల అర్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంకాల హోమాలు జరుగుతాయి.
News February 24, 2025
కరీంనగర్: గం‘జాయ్’లో యువత

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఇటీవల రామగుండంలో 60 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 22 గంజాయి కేసులు నమోదు చేసి 48మందిని అరెస్టు చేశారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. ధర్మపురి మండలం మగ్గిడికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి సరఫరా చేయడంతో అరెస్టు చేశారు.
News February 24, 2025
ఇండియా-పాక్ మ్యాచ్‌లో జేసీ పవన్

టీడీపీ సీనియర్ నేత జేసీ పవన్ రెడ్డి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరిగిన టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను తిలకించారు. తన స్నేహితులతో కలిసి గ్రౌండ్‌లో సందడి చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే మ్యాచ్‌ను చూడటానికి మంత్రి నారా లోకేశ్, పలువురు ఎంపీలు వెళ్లిన విషయం తెలిసిందే.