News September 10, 2025

దగదర్తి ఎయిర్ పోర్ట్‌కు రూ.916Cr తో టెండర్ల ఆహ్వానం

image

దగదర్తి ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో కదలిక వచ్చింది. మొదటి దశ పనులను PPP విధానంలో చేపట్టేందుకు ఏపీఏడీసీఎల్ అంతర్జాతీయ టెండర్‌ను ఆహ్వానించింది. దీని కోసం నవంబర్ 10న ఫ్రీ బిడ్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనుంది. ఈ నిర్మాణానికి 2016లోనే TDP ప్రభుత్వం 13 వందల ఎకరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సైతం రావడంతో ఉమ్మడి చిత్తూరు, కడప, నెల్లూరు వాసులకు అన్నీ విధాలా లబ్ధి చేకూరనుంది.

Similar News

News September 10, 2025

నెల్లూరు సమాచార శాఖ డీడీగా వేణుగోపాల్ రెడ్డి

image

నెల్లూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. అన్నమయ్య జిల్లాలో పౌర సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు ప్రమోషన్ ఇచ్చి నెల్లూరుకు బదిలీ చేసింది.

News September 10, 2025

మరో రెండు రోజుల్లో సోమశిల గేట్లు ఓపెన్ ?

image

సోమశిల జలాశయంలో 74 TMCల నీటిమట్టం దాటితే నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 70 TMCల నీటిమట్టం నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, పోలీసులకు సమాచారం చేరవేశారు. 11వ తేదీ నుంచి నీటి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డ్యాంకు ప్రవాహం కొనసాగుతోంది.

News September 9, 2025

నెల్లూరు: రేషన్ డీలర్స్‌కి కొత్త మిషన్లు

image

నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాల రేషన్ డీలర్స్‌కు ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మిషన్లను నెల్లూరు అర్బన్ MRO ఆఫీసులో అందజేశారు. వీటి ద్వారా సరుకులను సులభతరంగా ఇచ్చేందుకు వీలుగా ఉంటుందని సిబ్బంది తెలిపారు. గతంలో బటన్స్ నొక్కి ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు. కొత్త మిషన్లకు టచ్ స్క్రీన్ ఇవ్వడంతో నంబర్లను ఎంటర్ చేసేందుకు సులువుగా ఉంది. డివిజన్ పరిధిలో 300 వరకు మంగళవారం అందించినట్లు చెప్పారు.