News November 28, 2024

దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి: మంత్రి

image

దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో ఫోస్టర్ అడాప్షన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి చేతులు మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కావలసిన వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలను అమ్మినా,కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Similar News

News September 16, 2025

గోపాలపట్నంలో దారుణ హత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లపువానిపాలెం 89వ వార్డులో దారుణం జరిగింది. అలమండ నితీశ్ (23) అనే వ్యక్తి భీశెట్టి పరదేశి (75)పై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను కూడా బెదిరించాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 16, 2025

ప్రజలకు విశాఖ సిటీ పోలీసుల హెచ్చరిక

image

విశాఖపట్నం సిటీ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. లోన్ యాప్స్ వలలో పడి అనేక మంది వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. డౌన్లోడ్ చేసిన వెంటనే వ్యక్తిగత సమాచారం దోచుకుని, ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.

News September 16, 2025

ఏయూ: LAW కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

image

ఈ విద్యాసంవత్సరానికి గానూ విశాఖలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ LAW లో కోర్సులకు ఏయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 ఏళ్ల LLB, 3 ఏళ్ల LLB, 2 ఏళ్ల పీజీ LLM కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ అడ్మిషన్లు కలవు. సెప్టెంబర్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. LAWCET/CLAT క్వాలిఫైడ్ విద్యార్థులకు ప్రాధాన్యం.