News February 11, 2025
దమ్మపేట: యువకుడిపై పోక్సో కేసు

ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. దమ్మపేటకు చెందిన ఓ విద్యార్థినిని మందలపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర బార్గవ్ లైంగికంగా వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించేవాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
Similar News
News February 25, 2026
కోదాడ: రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రావెళ్ల సీతారామయ్య

తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కోదాడకు చెందిన రావెళ్ల సీతారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కోదాడ యూనిట్, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పదవి దక్కింది.
News February 25, 2026
డెల్టా రైతులకు గుడ్ న్యూస్.. మీ ఉత్పత్తులకు మార్కెట్ సిద్ధం!

ప్రకృతి వ్యవసాయంపై కొనుగోలుదారులు, విక్రేతల అనుసంధాన సమావేశం రాజమండ్రిలో బుధవారం ఘనంగా జరిగింది. తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మార్గదర్శకత్వంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. డెల్టా ప్రాంత రైతులు, ప్రాసెసర్లు, రిటైలర్లు పరస్పరం అనుసంధానమవడానికి ఈ సమావేశం చక్కని వేదికగా నిలిచింది. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్, విక్రయాల పెంపునకు పలువురు కీలక సూచనలు చేశారు.
News February 25, 2026
సంగారెడ్డి: నందికంది వాగులో మృతదేహం లభ్యం

సదాశివపేట మండలం నందికంది వాగులో 35 నుండి 45 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు బ్లూ కలర్ డ్రాయర్ ధరించి, నడుముకు ఎర్రని దారం, ఎడమ కాలుకు నల్లని దారం కలిగి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.


