News September 19, 2025
దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు KTR: మంత్రి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓ వైపు అధికార పార్టీ, మరో వైపు ప్రతిపక్ష పార్టీ నువ్వానేనా అన్నచందంగా మాటల తూటాలు పేలుస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ‘KTR నువ్వో పిల్లబచ్చా..అసెంబ్లీ ఎన్నికల్లో కాదు దమ్ముంటే జూబ్లీహిల్స్‌లో గెలిచి చూపించు..అప్పటికి నువ్వు ఇండియాలో ఉంటవో విదేశాలకు చెక్కేస్తవో’అని అన్నారు. నోటిదూల KTRకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని Tకాంగ్రెస్ Xలో ట్వీట్ చేసింది.
Similar News
News September 19, 2025
భూపాలపల్లిలో రేపు మినీ జాబ్ మేళా

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్యామల తెలిపారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ ప్రైవేట్ బ్యాంకులో 30 ఉద్యోగాలకు ఉ.11 గం.కు జాబ్ మేళా నిర్వహిస్తారన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత సంబంధిత అర్హత సర్టిఫికెట్లతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 19, 2025
వాడపల్లి వచ్చే భక్తులు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు శనివారం సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే ముందస్తు అంచనాలతో దేవస్థానం భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్‌లు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, మాడవీధుల్లో ఫ్యాన్లు, పార్కింగ్, టాయిలెట్లు సౌకర్యం తదితర సౌకర్యాల కల్పనను శుక్రవారం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పర్యవేక్షించారు.
News September 19, 2025
సంగారెడ్డి: మెరిట్ జాబితా విడుదల: డీఈవో

కేజీబీవీలో తాత్కాలిక పద్ధతిగా పనిచేసేందుకు ఏఎన్ఎం అకౌంటెంట్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జాబితా www.sangareddy.telangana.gov.inలో వచ్చినట్లు చెప్పారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 22లోపు ఆధారాలతో సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.