News July 15, 2024

దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి మీ మాటలు: గొట్టిపాటి

image

దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎద్దేవ చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకముందే ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఇసుక ధరలకు మీ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేదే లేదని ఆగ్రహించారు.

Similar News

News September 14, 2025

ఒంగోలు MP మాగుంటకు రెండవ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులురెడ్డి 2వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 84 ప్రశ్నలు అడగటంతోపాటు 6 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు 73.53 శాతంగా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.

News September 14, 2025

ప్రకాశం కలెక్టర్, SP వచ్చేశారు.. రేపే తొలి మీకోసం.!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్‌లు బదిలీ కాగా, వారి స్థానంలో వీరు బాధ్యతలు చేపట్టారు. కాగా తొలిసారి జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సోమవారం ‘‘మీకోసం కార్యక్రమానికి’’ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజల ముందుకు ఇద్దరూ ఉన్నతాధికారులు రానున్నారు.

News September 14, 2025

SP దామోదర్‌కు వీడ్కోలు

image

ప్రకాశం జిల్లా SP దామోదర్ ఐపీఎస్ విజయనగరానికి బదిలీ అయ్యారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 నెలల పాటు SPగా విశేష కృషి చేశారని పోలీస్ అధికారులు కొనియాడారు. ప్రత్యేక వాహనంలో వెళ్లిన దామోదర్‌కు పోలీసులు గౌరవ సెల్యూట్ చేశారు. పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.