News January 23, 2025

దరఖాస్తులకు మరో అవకాశం: కలెక్టర్ తేజస్

image

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు సభల్లో 630 మంది రైతు భరోసా, 5540 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 5356 మంది కొత్త రేషన్ కార్డులు, 7166 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

పెద్దపల్లి: ‘యువత మత్తుకు బానిస కావొద్దు’

image

మత్తుకు బానిస కాకుండా యువత దేశానికి మార్గదర్శకంగా నిలవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ అన్నారు. ఈగల్ నినాదంతో మత్తు నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మంగళవారం పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు వ్యతిరేక ర్యాలీ, అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

News September 16, 2025

జగిత్యాల: ‘విద్యార్థులకు సాంకేతిక విద్యను బోధించాలి’

image

విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్యను బోధించాలని, అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమాన్ని మంగళవారం అయన సందర్శించారు. విద్యార్థులకు పాఠాలు సులభతరంగా బోధన చేయడానికి టీఎల్ఎం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయన వెంట డీఈవో రాము తదితరులు ఉన్నారు.

News September 16, 2025

జగిత్యాల: ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో గల ఈవీఎం గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట భద్రతతో ఉండాలని, అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో మధుసూదన్ తదితరులున్నారు.