News November 3, 2025
దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి: భూపాలపల్లి కలెక్టర్

జిల్లాలో ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి 44 ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
రబ్బర్ బోర్డ్‌లో 51 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 4, 2025
కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

కాశీబుగ్గ తొక్కిసలాట నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఆయన వారితో ఫోన్‌లో మాట్లాడారు. కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
News November 4, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

నేడు కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ATP, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA పేర్కొంది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, HYD, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని HYD IMD తెలిపింది.


