News August 28, 2025
దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గురువారం ఆమె ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2017 నుంచి ఇప్పటి వరకు 33,600 మరణాలు సంభవించినప్పటికీ, ఈ పథకం కింద కేవలం 3,121 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని కలెక్టర్ అన్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరగాలని ఆమె సూచించారు.
Similar News
News August 29, 2025
NLG: భారత సైన్యం ఆహ్వానిస్తుంది.. దరఖాస్తు చేసుకోండి

భారత సైన్యంలో అగ్నివీర్ పథకం కింద అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ పోస్టుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అభ్యర్థులు JAN 2005 నుంచి JUL 2008 మధ్య జన్మించి ఉండాలని, ఇంటర్ లేదా డిప్లొమాలో ఏదైనా గ్రూపులో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News August 29, 2025
NLG: 29 నుంచి పెన్షన్ల పంపిణీ

వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు ఆసరా పెన్షన్లను ఈ నెల 29 నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారులు సెప్టెంబర్ 4 వరకు నేరుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా తమ పెన్షన్‌ను తీసుకోవచ్చని చెప్పారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన సూచించారు.
News August 28, 2025
NLG: ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లకు ఈనెల 30 చివరి తేదీ

నల్గొండ ఎన్జీ కాలేజీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 30వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929610, 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.