News April 3, 2025
దరఖాస్తు తేదీ పొడిగింపు: అదనపు కలెక్టర్ వీరారెడ్డి

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తు చేసుకునే తేదీని ఏప్రిల్ 14 వరకు పొడగించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని అందరు మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పథకం అమలు చేయుటకు తగు సూచనలు జారీచేశారు.
Similar News
News November 4, 2025
NZB: అపార్, యూడైస్ పనులను పూర్తిచేయండి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యా శాఖ అధికారులు, ప్రిన్సిపల్స్ సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఈరోజు జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వెంటనే విద్యార్థుల అపార్, యూడైస్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి కళాశాల ప్రిన్సిపల్ కచ్చితంగా ఆపార్, యూడైస్, పెన్ నంబర్లను విద్యార్థులకు అందజేయాలన్నారు.
News November 4, 2025
VZM: ఉపాధి హామీ పనులకు వెండర్లకు శిక్షణ

విజయనగరంలోని స్థానిక గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాంగణంలో వెండర్లకు మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపౌండ్ పనులకు సంబందించి ఆన్‌లైన్‌లో టెండర్లు దక్కించుకోవడంపై అమరావతి పీఆర్ఆర్డీ కార్యాలయ అధికారి గోపీచంద్ వెండర్లతో పాటు అధికారులకు అవగాహన కల్పించారు. పనుల నిర్వహణపై పలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శారద పాల్గొన్నారు.
News November 4, 2025
NZB: గెలిచిన తర్వాత కూడా దేవుడి కోసం పనిచేయాలి: కవిత

బీజేపీ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు రాముడి పేరు చెప్పి ఓట్లడుగుతారని, వాళ్లు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దేవుడి కోసం పనిచేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం కవిత ఆదిలాబాద్‌లో మాట్లాడారు. జైనాథ్ ఆలయ గర్భగుడిలోకి వర్షం నీళ్లు వస్తున్నాయని, ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు జైనాథ్ ఆలయాన్ని పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


