News April 17, 2024
దర్గాలో శ్రీరాముని కళ్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్ మీరా దర్గాలో శ్రీరామనవమి వేడుక కన్నుల పండుగగా జరిగింది. మతాలకు అతీతంగా దర్గాలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్గాలోని మాలిక్ సర్వమతాలకు అతీతంగా రాములవారి కళ్యాణం జరిపించడం పై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News February 20, 2026
రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి బాధాకరం: హరీష్‌రావు

రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో విశ్రాంత ఏఆర్ ఎస్సై మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుమారు రూ.60 లక్షల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, వైద్య ఖర్చులు భరించలేక ఆయన మరణించడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించాలని, రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News February 20, 2026
పెనుబల్లి: మిత్రుడి కోసం వచ్చి.. అనంతలోకాలకు!

మిత్రుడి దశదినకర్మకు హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏలూరు జిల్లా ఎండపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ బర్రె వంశీ మృతి చెందారు. పెనుబల్లి వద్ద గురువారం బైక్ అదుపుతప్పి డ్రైనేజీని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సత్తుపల్లి డిపోలో పనిచేస్తున్న వంశీకి భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. స్నేహితుడిని కడసారి చూసేందుకు వచ్చి, తానూ విగతజీవిగా మారడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
News February 20, 2026
ఖమ్మం: అడ్డగోలుగా అబార్షన్ కిట్స్ అమ్మకాలు..!

ఖమ్మం జిల్లాలో డాక్టర్ రిఫరెన్స్ లేకుండా అబార్షన్ కిట్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని వాడుతున్న మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఏడాదిలో 50 వేల కిట్స్ అమ్ముడయ్యాయి. షెడ్యూల్-H కిందకి వచ్చే మీసో ప్రోస్టల్ మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దు. ఇలాంటి మెడికల్ షాపులపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని DI అనిల్ తెలిపారు.


