News March 25, 2024
దర్శిలో వీడని ఉత్కంఠ?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయింది. కూటమి నుంచి ఒక్క దర్శి మినహా. దీనికి ప్రధానం కారణం పొత్తులో ఇక్కడ ఏ పార్టీకి సీటు కేటాయించాలన్నది పెను సవాలుగా మారింది. అటు టీడీపీ నుంచి బాచిన కృష్ణ చైతన్య, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు పోటీలో ఉండగా, జనసేన నుంచి గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నాడు. దీంతో ఎవరికీ సీటు ఇచ్చి ఎవరిని బుజ్జగిస్తారో అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది.
Similar News
News February 11, 2026
అనుమతుల జారీలో జాప్యం ఉండరాదు: జేసీ

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.
News February 11, 2026
జిల్లా ప్రజలకు ప్రకాశం ఎస్పీ కీలక సూచనలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రముఖ ఆలయాల వద్ద చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా సాయం కోసం డయల్ 100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
News February 11, 2026
ప్రకాశం: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని DEO రేణుక తెలిపారు.


