News June 15, 2024
దర్శి: ఈతకు వెళ్లి ఇద్దరి విద్యార్థులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన దర్శిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దర్శి మండలం లంకోజినపల్లికి చెందిన నవీన్ (16), చందు (16)లు గురువారం ఇద్దరూ బయటకు వెళ్లారు. తర్వాత వీరిద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. శుక్రవారం ఉదయం దర్శిలోని ఎన్‌ఎపీ చెరువులో మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 13, 2025
రేగలగడ్డలో భార్యను చంపి, భర్త ఆత్మహత్యాయత్నం

మర్రిపూడిలోని రేగలగడ్డలో దారుణం జరిగింది. నారాయణ భార్య అంజమ్మను శుక్రవారం రాత్రి గొంతుకోసి చంపి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజమ్మ చనిపోగా.. నారాయణ కొన ఊపిరితో ఉన్నాడు. గ్రామస్థులు సమాచారం పోలీసులకు అందజేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 12, 2025
ప్రకాశం: బార్ల లైసెన్సులకు గడువు పొడిగింపు

ప్రకాశం జిల్లాలోని 4 ఓపెన్ కేటగిరి బార్ల లైసెన్సులకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 2 ఓపెన్ బార్ల లైసెన్స్‌ల కొరకు దరఖాస్తు గడువు గతంలో 14వ తేదీ వరకు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ గడువు తేదీని 17 వరకు పొడిగించామన్నారు.
News September 12, 2025
ఉలవపాడు: బాలికపై సచివాలయం ఉద్యోగి అత్యాచారం

ఉలవపాడులో ఇటీవల ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన గురువారం వెలుగు చూసింది. SI అంకమ్మ వివరాల ప్రకారం.. ఇటీవల అనాధగా కనిపించిన బాలిక(13)ను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా చేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పనిమనిషిగా చేసింది. ఈక్రమంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.