News June 29, 2024
దర్శి: కేవీకే కోఆర్డినేటర్గా సీనియర్ శాస్త్రవేత్త

దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాధ్యతలను సీనియర్ శాస్త్రవేత్త డా.జీ.రమేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కేవీకే బోధన బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రకాశం జిల్లా రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందిస్తానని భరోసా కల్పించారు. ఈయన గతంలో పల్నాడు జిల్లా ఏరువాక కేంద్రంలో సమన్వయకర్తగా విధులను నిర్వహించారు.
Similar News
News November 8, 2025
భక్త కనకదాస రచనలు అనుసరణీయం: ఎస్పీ

భక్త కనకదాస జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కనక దాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. కనకదాస రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాస చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన రచనలు ప్రజల్లో భక్తి, సమానత్వం, న్యాయం, సత్యం వంటి విలువలను బోధించాయని పేర్కొన్నారు.
News November 8, 2025
ఆ ఐదు సెలవులు రద్దు: ప్రకాశం డీఈవో

సెలవులపై ప్రకాశం డీఈవో ఎ.కిరణ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెలతో పాటు వచ్చే మార్చి వరకు ఉన్న అన్ని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో వరుస సెలవులు ఇవ్వడంతో ఈ 5సెలవు రోజుల్లో స్కూళ్లు పనిచేయాలని ఆదేశించారు. ఈనెల రెండో శనివారం, డిసెంబర్ 13, 2026 జనవరి 25, ఫిబ్రవరి 14, మార్చి 14వ తేదీల్లో స్కూళ్లు నిర్వహించాలన్నారు.
News November 8, 2025
జిల్లా స్థాయి పోటీలకు మార్కాపురం విద్యార్థుల ఎంపిక

ప్రకాశం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ అండర్-14 లో మార్కాపురం బాలురు సత్తా చాటారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న వి.మహేష్ 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించారు. ఎం. అజయ్ 400, 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు.


