News March 28, 2024

దర్శి టికెట్‌పై నీలినీడలు?

image

దర్శి టికెట్‌పై రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారా అని అటు పార్టీలో, ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొనగా, రోజుకో కొత్త పేరు వినపడుతోంది. టీడీపీ నుంచి గోరంట్ల రవికుమార్, మాజీ MLA గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తోంది. బాచిన కృష్ణచైతన్య, మాగుంట రాఘవరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటు జనసేన నుంచి గరికపాటి వెంకట్ టికెట్ ఆశిస్తున్నాడు.

Similar News

News September 29, 2025

గిద్దలూరు: 55 ఏళ్ల తర్వాత కలిశారు

image

ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గిద్దలూరులోని ఓ ప్రైవేట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 1969-70 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరగింది. 55 సంవత్సరాల అనంతరం కలిసిన స్నేహితులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు.

News September 29, 2025

ప్రకాశం పోలీస్ పవర్.. ఒకేరోజు 80 మంది అరెస్ట్.!

image

ప్రకాశం జిల్లాలోని 16 ప్రదేశాల్లో పోలీసులు దాడులు నిర్వహించి ఏకంగా 80 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం విస్తృతంగా పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 74 మందిని గుర్తించి కేసులు సైతం నమోదు చేశారు.

News September 29, 2025

కనిగిరిలో కలెక్టర్ పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు సోమవారం కనిగిరిలో నిర్వహించే మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమం జరిగే పట్టణంలోని పవిత్ర ఫంక్షన్ హాలును ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఆరు మండలాల నుంచి సమస్యలు విన్నవించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.