News April 13, 2025

దర్శి: మహిళ దారుణ హత్య

image

దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. తరువాత అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 15, 2025

ఎస్పీని కలిసిన నూతన డీఎస్పీ

image

సాధారణ బదిలీల్లో భాగంగా ఒంగోలు మహిళ పోలీస్ స్టేషన్‌కు నూతన డీఎస్పీగా వి.వి. రమణ కుమార్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్పీ ఆయనకు పలు సూచనలు చేశారు.  శక్తి యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

News April 14, 2025

పిల్లలపై శ్రద్ధ అవసరం: డీఎస్పీ

image

వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని కనిగిరి డీఎస్పీ పి.సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సెలవు అని చెప్పి ఈత కోసం బావులు, చెరువులు వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు వాళ్ల పిల్లలపై శ్రద్ధ వహించాలని కోరారు.

News April 14, 2025

అంబేడ్కర్‌కి నివాళి అర్పించిన కలెక్టర్

image

ఒంగోలులో అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేడ్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. HCM కళాశాల సెంటర్, కలెక్టరేట్ సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డీఆర్ఓ చిన్న ఓబులేసు, వివిధ దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ గురించి కొనియాడారు.

error: Content is protected !!