News March 26, 2024

దర్శి: వీఆర్వో మృతి

image

దర్శి మండలం తూర్పువీరయ్యపాలెం వీఆర్వోగా పనిచేస్తున్న దేసు జయప్రకాష్ (48) మంగళవారం మృతి చెందారు. గత పది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వీఆర్వో సంఘం నాయకులు, దర్శి మండలం వీఆర్వో ఉద్యోగులు సంతాపం తెలిపారు.

Similar News

News March 4, 2026

ప్రకాశం: తౌషిక్ మృతి.. పాఠశాలకు షోకాజ్ నోటీస్

image

ప్రకాశం(D) S.కొండ చైతన్య పాఠశాలలో ఇటీవల 6వ తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ త్రిసభ్య కమిటీతో విచారణకు ఆదేశించారు. కమిటీ పాఠశాలను సందర్శించి అనేక లోపాలను గుర్తించింది. నివేదికను పరిశీలించిన DEO రేణుకకు ఇవ్వగా ఆమె పాఠశాల యాజమాన్యానికి మంగళవారం షోకాజ్ జారీచేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల గుర్తింపును ఎందుకు రద్దు చేయరాదో తెలపాలన్నారు.

News March 4, 2026

కలెక్టర్‌ను కలిసిన MP మాగుంట, MLA జనార్దన్

image

ఒంగోలు MLA జనార్దన్, MP మాగుంట శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబును కలెక్టరేట్‌లో కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై వారు చర్చించారు. ఒంగోలులో నెలకొన్న సమస్యలను జనార్దన్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్లమెంట్ పరిధిలోని సమస్యలను మాగుంట వివరించారు. కలెక్టర్ పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని తెలిపారన్నారు.

News March 3, 2026

వెలుగొండ నిర్వాసితులకు న్యాయం ఏది..?

image

వెలుగొండ ప్రాజెక్టు కింద ముంపుకు గురైన గ్రామాల నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాలు ముంపుకు గురికానుండగా.. పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు.