News November 30, 2024

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: ADB కలెక్టర్

image

రైతులు తమ పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో దళారుల మాటలను నమ్మి మోసపోకూడదని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పత్తి పంటకు కనీస మద్దతు ధర రూ.7,521 చెల్లిస్తున్నామని, నాణ్యత ప్రమాణాలు పాటించి 8 శాతం నుంచి 12 శాతం వరకు తేమ తగ్గకుండా పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు.

Similar News

News January 14, 2025

44 నేషనల్ హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి

image

బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.

News January 14, 2025

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో దస్తూరాబాద్ విద్యార్థి ప్రతిభ

image

కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025లో  నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ ZHS విద్యార్థి కొట్టే అభిషేక్ ప్రతిభ చాటి మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఇందులో 102 కేజీ కేటగిరి యూత్ విభాగంలో సిల్వర్, జూనియర్ విభాగంలో సిల్వర్, సీనియర్ విభాగంలో బ్రాంజ్ మెడల్‌లను సాధించాడు. అభిషేక్‌ను HM వామాన్ రావ్, PET నవీన్ అభినందించారు.

News January 14, 2025

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

image

డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరం స్పెల్-II, ఓల్డ్ బ్యాచ్ 2016 అంతకుముందు బ్యాచ్‌ల వారు అలాగే రీ అడ్మిషన్ తీసుకున్న వారు సప్లిమెంటరీ ఫీజును ఈ నెల ఈనెల 14వరకు చెల్లించవచ్చన్నారు. ఇందుకు రూ. 500 అపరాధ రుసుం కట్టాలన్నారు.