News October 6, 2024
దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లు పై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.
Similar News
News November 9, 2025
SKLM: ‘ఈనెల 11న జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు’

జాతీయ విద్య దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం కలెక్టర్ సమావేశ మందిరంలో ఈనెల 11న నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి, ‘భారత రత్న’ జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని జరపనున్న కార్యక్రమంలో అధికారులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
News November 9, 2025
మాంగోలియా జైల్లో ఇరుక్కున్న సిక్కోలు వాసి

ఉపాధి నిమిత్తం విదేశానికి వెళ్లిన ఓ శ్రీకాకుళం జిల్లా వ్యక్తి అక్కడి జైల్లో ఇరుక్కున్నాడు. సంతబొమ్మాళి(M) లక్కీవలస పంచాయతీ పిట్టవానిపేటకు చెందిన తూలు గారయ్య 5నెలల అగ్రిమెంట్‌తో పెయింటింగ్ పనులకు వెళ్లాడు. ఈనెల 7న ఇండియాకు వస్తానంటూ అక్కడి ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోన్ చేసిన తన భర్త ఇప్పటి వరకు రాలేదని భార్య తూలు ఎర్రమ్మ వాపోయారు. ప్రభుత్వం సాయం చేయాలని ఆమె కోరుతున్నాడు.
News November 9, 2025
శ్రీకాకుళం: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఏటా కార్తీక మాసం 3వ సోమవారం సెలవు ఇస్తారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(DTF) శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసన్న, కృష్ణారావు చెప్పారు. కానీ రేపటి నుంచి జిల్లాలో అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.


