News September 22, 2025

దసరా ఎఫెక్ట్.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులు

image

దసరా ఉత్సవాల ఎఫెక్ట్‌తో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. నేటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పండగకు సొంత ఊరుకి వెళ్లే ప్రయాణికులతో వాహనాలు కిటాకిలాడుతున్నాయి. సమయానికి బస్సులు లేకపోవడం, ఉన్న బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సోమవారం రాత్రి పాయకరావుపేటలోని బస్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది.

Similar News

News September 23, 2025

MBNR జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేస్తామని, తనిఖీలకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News September 23, 2025

GWL: ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: ఎస్పీ

image

ప్రజల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పోలీసులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో 16 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో భూ సమస్యలు 3, కుటుంబ తగాదాలు 4, గొడవలు 3, ప్లాటు, ప్రభుత్వ ఉద్యోగం, విదేశాలకు పంపే అంశాలపై ఒక్కో ఫిర్యాదు వచ్చాయన్నారు. ఇతర అంశాలపై 3 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.

News September 23, 2025

NGKL: పోలీస్ ప్రజావాణిలో 15 ఫిర్యాదులు

image

నాగర్‌కర్నూల్‌లోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.