News September 13, 2025
దసరా: దుర్గగుడిలో ప్రోటోకాల్ టికెట్లు రద్దు?

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గగుడిలో ప్రోటోకాల్ కింద ఇచ్చే బ్రేక్ దర్శనం టికెట్లను ఈసారి రద్దు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. గతేడాది ఎమ్మెల్యేలు, ఎంపీ, కలెక్టర్ వంటి ప్రముఖులకు రోజుకు 100 ఉచిత టికెట్లు కేటాయించారు. దీనివల్ల సాధారణ భక్తులకు దర్శనం ఆలస్యం కావడమే కాకుండా, ఆలయానికి ఆదాయం కూడా తగ్గుతోందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Similar News
News September 13, 2025
ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు బండి పిలుపు

సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోవడంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. సాయిధ విప్లవ పోరాటాలు కాలం చెల్లినవని, మావోయిస్టులు ఆయుధాలు విడిచి పెట్టి ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజాకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
News September 13, 2025
NZB: హైకోర్టు జడ్జీలతో భేటీ అయిన కలెక్టర్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.సామ్ కోషి, జస్టిస్ సృజన శనివారం సందర్శించగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వారితో భేటీ అయ్యారు. జడ్జీలు నిర్మల్ జిల్లాలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఎస్సారెస్పీని సందర్శిచగా కలెక్టర్ వారితో భేటీ అయ్యి ఎస్సారెస్పీ ప్రాజెక్టు గురించి, జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
News September 13, 2025
అచ్యుతాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజమండ్రి వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కొయ్యలగూడెం వైపు వస్తున్న శ్రీరామ్ బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజమండ్రి వైపు వెళ్లే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీరామ్, అతని తల్లికి తీవ్రగాయాలు కాగా కొయ్యలగూడెం PHC నుంచి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్‌కి తరలించినట్లు EMT బద్రి తెలిపారు.