News September 21, 2025

దసరా పండుగ.. జర ఇల్లు భద్రం: వరంగల్ సీపీ

image

దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలను అప్రమత్తం చేశారు. దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండటంతో ఇళ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే, చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత పోలీసులు సూచినలు పాటించాలని సీపీ ప్రజలకు తెలిపారు.

Similar News

News September 21, 2025

బ్రహ్మోత్సవాల సమయంలో వివాదాలు అవసరమా..?

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తిరుమల వైపు చూస్తారు. టీటీడీ టార్గెట్‌గా సాగుతున్న వివాదం కారణంగా భక్తులు బ్రహ్మోత్సవాల హడావిడిపై కాకుండా వివాదంపై దృష్టి మళ్లుతుంది. తిరుమల పవిత్రత దృష్ట్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగేలా దృష్టి సారించాలని భక్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

News September 21, 2025

రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి

image

TG: రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని Dy.CM భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. మహిళలంతా ఆర్థికంగా, శక్తిమంతులుగా ఎదగాలి’ అని అన్నారు. అంతకుముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో ప్రదర్శించిన సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ‌పై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు.

News September 21, 2025

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు: ఎస్పీ

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలపైన కానీ, కులమతాల పైనగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ మేరకు కదిరికి చెందిన అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఆయనపై ఐదు కేసులు నమోదు చేసి జైలుకు పంపామని తెలిపారు.