News October 8, 2025
దసరా మహోత్సవం విజయవంతం: కలెక్టర్ లక్ష్మీశా

2025 సంవత్సరానికి సంబంధించి దసరా మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ దాన్య చంద్ర అన్నారు. దసరా మహోత్సవంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులకు ప్రశంస పత్రాలు అందించి, అభినందనలు తెలిపారు.
Similar News
News October 8, 2025
MBNR: దసరా EFFECT.. రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పది డిపోలలో రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చినట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. గత నెల 20 నుండి ఈ నెల 6 వరకు 14 రోజుల్లో బస్సులను 53.07 లక్షల కిలోమీటర్లు తిప్పి.. రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ మేరకు కండక్టర్‌లు, డ్రైవర్లు, ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ప్రత్యేక అభినందనలని ఆర్ఎం తెలిపారు. SHARE IT
News October 8, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని సామగుట్టు పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో కుప్పం మండలం నూలుకుంట కు చెందిన వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 8, 2025
అక్టోబర్ 8: చరిత్రలో ఈరోజు

1895: రచయిత అడివి బాపిరాజు జననం
1932: సినీ రచయిత శివ శక్తి దత్త జననం
1935: నటుడు మందాడి ప్రభాకర రెడ్డి జననం
1963: తెలుగు సినిమా నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు మరణం
1970: సినీ నటుడు, నిర్మాత నెల్లూరు కాంతారావు మరణం
1974: సినీ దర్శకుడు బి.ఆర్.పంతులు మరణం
* భారత వైమానిక దళ దినోత్సవం