News April 8, 2025
దస్తూరాబాద్: అత్యంత వైభవంగా రథోత్సవం

శ్రీ రామనవమి ఉత్సవాలలో భాగంగా రేవోజిపేట గ్రామంలో శ్రీ రాముల వారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ హరిహర క్షేత్రం నుంచి ఆలయ పుర విధుల గుండా డప్పు చప్పుళ్లతో డీజే మధ్య స్వాముల నృత్యల రథోత్సవాన్ని ఊరేగించారు. మహిళలు స్వామి వారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకుడు వంశీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
Similar News
News July 5, 2025
బాలికను మోసగించిన వ్యక్తికి జైలు శిక్ష

బాలికను పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తికి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి 22 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దామరచర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన మహేశ్ ప్రేమ పేరుతో లోబరుచుకొని గర్భవతిని చేశాడు. దీంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం శిక్షతో పాటు రూ.35 వేల ఫైన్, బాధితురాలికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలని DLSA ఆదేశించింది.
News July 5, 2025
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్లలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైరబోయిన వెంకటేశ్వర్లు (36) రాత్రి పీర్ల ఊరేగింపులో ఉండగా ప్రత్యర్థులు గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. అయితే హత్యకు గురైన వ్యక్తి సుమారు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని హత్య చేశాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కూడా హత్యకు గురయ్యాడు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
News July 5, 2025
సిద్దిపేట: ‘విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి’

విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. గజ్వేల్ పాత సయ్యద్ హాసిమ్ ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.