News February 26, 2025
దస్తూరాబాద్: పురుగుమందు తాగి ఒకరి సూసైడ్

దస్తూరాబాద్ మండలంలోని మున్యాల గోండుగూడెం గ్రామానికి చెందిన పుర్క జగన్ (45) మంగళవారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అప్పుల పాలు కావడంతో మంగళవారం పుర్క జగన్ తన నివాసంలో గుర్తు తెలియని పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు SI నమోదు చేశారు.
Similar News
News January 7, 2026
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దు: కలెక్టర్

రెవెన్యూ శాఖ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యలు, వివిధ సంక్షేమ పథకాలతో సంబంధం ఉన్న వినతులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పీవో యువరాజ్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు
News January 7, 2026
రన్నింగ్ vs వెయిట్ లిఫ్టింగ్.. ఏది బెటరంటే?

రన్నింగ్ మేలా లేక వెయిట్ లిఫ్టింగ్ బెటరా? అనే ప్రశ్నకు ప్రముఖ వైద్యుడు సుధీర్ సమాధానమిచ్చారు. ‘దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం రెండింటినీ చేయడం బెటర్. శాస్త్రీయంగా చూస్తే గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణలో రన్నింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. వృద్ధాప్యంలో కండరాలు, ఎముకల దృఢత్వానికి వెయిట్ లిఫ్టింగ్ అత్యవసరం. అయితే ఈ రెండింటినీ చేయడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ & క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు’ అని తెలిపారు.
News January 7, 2026
పాక్‌లో ఓపెన్ టెర్రర్ క్యాంపులు: జైశంకర్

పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు. అది ఏదో రహస్యంగా చేసే పని కాదని, ఆ దేశంలోని పెద్ద నగరాల్లోనే బహిరంగంగా టెర్రర్ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నాయని కుండబద్దలు కొట్టారు. దీనికి ఆ దేశ సైన్యం పూర్తి మద్దతు ఉందన్నారు. పాక్ తీరు వల్ల ఆ దేశంతో సంబంధాలు ఎప్పటికీ ఓ మినహాయింపు అని, ఈ చేదు నిజం ఆధారంగానే భారత్ తన పాలసీలను రూపొందిస్తోందని స్పష్టం చేశారు.


