News March 27, 2025

దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

image

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు.  రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!

Similar News

News November 5, 2025

ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 5, 2025

గూడెం: ఆలయంలో కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు పూర్తి

image

దండేపల్లి మండలంలోని పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.

News November 4, 2025

యాదాద్రి: కార్తీక పౌర్ణమి వ్రతాలకు ప్రత్యేక ఏర్పాట్లు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం రేపు ఒక్కరోజు ఎనిమిది బ్యాచులుగా వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.