News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్‌కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!
Similar News
News November 4, 2025
మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి: ఆదిలాబాద్ ఎస్పీ

మహిళలు, విద్యార్థినుల రక్షణ, భద్రతపై జిల్లా పోలీసుల ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో “పోలీస్ అక్క” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాల,కళాశాలను మహిళ పోలీసు సందర్శించాలని సూచించారు. పోలీస్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News November 4, 2025
ఆదిలాబాద్: మంత్రి పొన్నంను కలిసిన జిల్లా గౌడ సంఘం నేతలు

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను జిల్లా గౌడ సంక్షేమ సభ్యులు కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి గౌడ కులస్థుల సమస్యలు, గౌడ కమ్యూనిటీ హాల్, వసతి గృహం ఏర్పాటు గురించి విన్నవించారు. ప్రభుత్వం గౌడ్ల సమస్యలు, బీసీ రిజర్వేషన్ల సాధన, కుల గణన వంటి అంశాలపై కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రమేశ్ చందర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, నాందేవ్, లక్ష్మీనారాయణ, చరణ్ గౌడ్ ఉన్నారు.
News November 4, 2025
ఆదిలాబాద్: ఈనెల 6 నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేతపై కలెక్టర్ సమీక్ష

రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లులు నవంబర్ 6 నుంచి నిరవధికంగా మూసివేయనున్నట్లు తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగ అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులు, మార్కెటింగ్, వ్యవసాయ, రవాణా, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.


