News March 27, 2025
దహెగాం: పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన అనురాధ

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో సెంటర్కు వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని అనురాధ. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చౌక గ్రామానికి చెందిన రాజయ్య బుధవారం ఉదయం చనిపోయారు. రాజయ్య కుమార్తె అనురాధ అదే బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసి అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొంది. ఆమె ఎంతో గ్రేట్ కదా..!
Similar News
News July 7, 2025
కామారెడ్డి జిల్లాలో 4 పాఠశాలలు రీ ఓపెన్

కామారెడ్డి జిల్లాలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభించేందు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జీరో ఎన్రోల్మెంట్తో పాటు పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడంతో పాఠశాలలను మూసివేశారు. బిక్కనూర్(M) మోటాట్పల్లి, జుక్కల్(M)మధురతండా, మాచారెడ్డి(M) నెమ్లిగుట్టతండా, సదాశివనగర్(M) దగ్గిలో మంగళవారం పాఠశాలలను రీ ఓపెన్ చేయనున్నారు.
News July 7, 2025
శాకాంబరీ ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారి దర్శనం

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న శాకాంబరీ మహోత్సవాల్లో భాగంగా పన్నెండవ రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసం ద్వాదశి తిథి సోమవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.
News July 7, 2025
NLG: తీవ్ర విషాదం.. తండ్రి, కుమారుడు మృతి

ఆగి ఉన్న కారును కంటైనర్ ఢీకొనడంతో కారులో ఉన్న తండ్రి, కుమారుడు మృతిచెందిన ఘటన తిప్పర్తి మండలం రాయినిగూడెం స్టేజీ వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. HYD నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఆపిన ఓ కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన తండ్రి, కుమారుడు నాగేశ్వరరావు(44), అభిషేక్ (21) మృతి చెందగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిప్పర్తి ఎస్ఐ శంకర్ తెలిపారు.