News October 16, 2025
దహేగాం: పాము కాటుతో గర్భిణీ మృతి

దహేగాం మండల కేంద్రానికి చెందిన స్రవంతి(22) అనే గర్భిణీ పాము కాటుకు గురై మృతి చెందింది. కుటుంబీకుల వివరాలు.. బుధవారం భర్త శ్యామ్‌తో స్రవంతి పత్తి చేనుకు వెళ్లింది. ఈక్రమంలో నీళ్లు తాగడానికి మోటార్ వైపు వెళ్తుండగా పాము కాటేసింది. గమనించిన భర్త వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రథమిక చికిత్స చేసి బెల్లంపల్లికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Similar News
News October 16, 2025
నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి: APSDMA

AP: దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని APSDMA తెలిపింది. దేశంలోకి మే 24న, రాష్ట్రంలోకి మే 26న ఈ రుతుపవనాలు ప్రవేశించినట్లు వివరించింది. అటు ఇవాళ దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ఇవాళ ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News October 16, 2025
KNR: 30లక్షల క్వింటాళ్ల వరిధాన్యం సేకరణే లక్ష్యం

ఖరీఫ్ 2025-26 సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 325 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ నర్సింగరావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ఏజెన్సీల ద్వారా ఈసారి సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నర్సింగరావు చెప్పారు.
News October 16, 2025
డెక్కన్ సిమెంటు వివాదంతో నాకు సంబంధం లేదు: ఉత్తమ్

TG: డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ వివాదంపై తాను మాట్లాడేది లేదన్నారు. ‘నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా చెప్పారు కదా?’ అని ముక్తసరిగా స్పందించారు. కొన్నిరోజులుగా మంత్రి కొండా సురేఖకు ఇతర మంత్రులకు మధ్య వివాదం రేగడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా దృష్టి సారించింది. పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగారు.