News July 4, 2024
దాచేపల్లి వద్ద స్కూల్ ప్రిన్సిపల్ మృతదేహం కలకలం

దాచేపల్లి పిడుగురాళ్ల హైవేపై వాసవి గ్రీన్ సిటీలో స్థానిక ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల ప్రిన్సిపల్ నాగిరెడ్డి మృతదేహంగా కనిపించడం గురువారం కలకలం రేపింది. ఈనెల ఒకటో తారీకు నుంచి నాగిరెడ్డి కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తించలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు నాగిరెడ్డిగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
Similar News
News September 17, 2025
GNT: CM ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్

DSC నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం సమీక్షించారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర సచివాలయం దగ్గర DSCలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే ప్రాంగణంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో SP వకుల్ జిందాల్, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు RDO శ్రీనివాస రావు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.
News September 17, 2025
బుల్లెట్ రైలు ప్రాజెక్టు.. మట్టి నమూనాల సేకరణ

హైదరాబాద్-చెన్నై మార్గంలో నిర్మించతలపెట్టిన హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా, గుంటూరు జిల్లాలో ఫైనల్ లొకేషన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. DPR రూపొందించడం, ఫైనల్ ఎలైన్మెంట్ డిజైన్ కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా, 20 మీటర్ల లోతులో ప్రతి 5 మీటర్లకు ఒకసారి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు.
News September 17, 2025
శాసన సభ స్పీకర్ను కలిసిన గుంటూరు ఎస్పీ

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకొని ప్రజా భద్రతను కాపాడాలని స్పష్టం చేశారు.