News March 5, 2025
దాచేపల్లి: సచివాలయ ఉద్యోగి వీడియో.. స్పందించిన లోకేశ్

పల్నాడు జిల్లా దాచేపల్లిలో సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బులతో పారిపోయాడు. ఈ మేరకు నిన్న క్షమించండి, డబ్బులు కట్టేస్తానంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి లోకేశ్ స్పందించారు. మనుషులుగా తప్పులు చేస్తుంటాం, కానీ వాటి నుంచి మంచి నేర్చుకోవటం ముఖ్యం. మీ కుటుంబానికి తొలి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లకండి అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
Similar News
News September 16, 2025
పెద్దపల్లి: ‘జర్నలిస్టు సాంబశివరావుపై కేసులు ఎత్తివేయాలి’

టీ న్యూస్ ఖమ్మం ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళనకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. జర్నలిస్టులపై కేసులు పెట్టడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఉల్లంఘన అని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ ఖండించారు.
News September 16, 2025
HNK, BHPLలో నిలిచిపోనున్న రైల్వే రిజర్వేషన్ సేవలు

హనుమకొండ హెడ్ పోస్ట్ ఆఫీస్, భూపాలపల్లి పోస్ట్ ఆఫీస్‌లో రైల్వే రిజర్వేషన్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రతిరోజు కనీసం 10 టికెట్ల బుకింగ్ జరగడం లేదనే కారణంతో ఈ సేవలను నిలిపివేస్తూ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సీనియర్ సిటిజన్స్ సహా నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ కావ్య తక్షణమే ఈ సేవలను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
News September 16, 2025
పెద్దపల్లి: ‘మైక్రో బ్రూవరీ నోటిఫికేషన్ రద్దు చేయాలి’

రామగుండం కార్పొరేషన్‌లో మైక్రో బ్రూవరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా AIYF PDPL జిల్లా సమితి మంగళవారం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసింది. మద్యం వల్ల యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, ఇప్పటికే బెల్టు షాపులు, వైన్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో బ్రూవరీ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని AIYF నాయకులు హెచ్చరించారు.