News September 8, 2025

దాతలు ముందుకు రావాలి: KMR కలెక్టర్

image

ఈ నెల 9వ తేదీన ఎల్లారెడ్డిలో వరద బాధిత కుటుంబాలకు 150 కిట్లను, బాన్సువాడలో 150 కిట్లను అందజేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఆపద సమయంలో ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకుంటున్నందుకు సంస్థలకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మరింత కొంత మంది దాతలు ముందుకు వచ్చి వరద భాదితులను ఆదుకోవాలని కోరారు.

Similar News

News September 9, 2025

తిరుపతి: 3నెలల పాటు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న యువతీయువకులకు 3 నెలల పాటు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నట్లు DRDA -సీడాప్ పీడీ తెలిపారు. DDUGKY స్కీమ్ ద్వారా ట్రైనింగ్‌తో పాటు వసతి, భోజన సదుపాయాలు, ఉపాధి కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. ఇంటర్ చదివి 18 నుంచి 26 ఏళ్ల లోపు వారు అర్హులు అని అన్నారు.

News September 9, 2025

కపిలేశ్వరపురం: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక గ్రామంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నందమూరి సూరిబాబు ఇంటి నిర్మాణం కోసం స్లాబ్ సెంట్రింగ్ పనులు చేస్తున్నారు. టేకి గ్రామానికి చెందిన ముగ్గురు ఇనుప ఊచలను కింద నుంచి పైకి లాగుతున్నప్పుడు, బిల్డింగ్ ఎదురుగా ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో వాసంశెట్టి శ్రీనివాస్ (35) మృతి చెందాడు.

News September 9, 2025

గ్రంథాలయాలను బలోపేతం చేయాలి: డా. రియాజ్

image

తెలంగాణలోని అన్ని స్థాయిల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ విజ్ఞప్తి చేశారు. “మరో గ్రంథాలయ ఉద్యమం, పుస్తకంతో నడక” అనే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు నడక ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వమే కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథాలయాలకు సరఫరా చేస్తే మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.