News January 30, 2026

దానంపై అనర్హత పిటిషన్లు.. విచారణ ప్రారంభం

image

TG: ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ కౌశిక్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై స్పీకర్ విచారణ ప్రారంభించారు. ఇదే విషయంపై మహేశ్వర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను ఇవాళ 12pmకు విచారిస్తారు. విచారణ నిమిత్తం అసెంబ్లీకి దానం చేరుకున్నారు. అంతకుముందు అడ్వకేట్లతో చర్చించారు. కౌశిక్‌, మహేశ్వర్‌ను నాగేందర్‌ లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. తాను BRSలోనే ఉన్నానని దానం ఇప్పటికే కౌంటర్ వేశారు.

Similar News

News February 21, 2026

పాక్‌లో ‘డెత్ స్క్వాడ్’.. 8 నెలల్లో 924 మంది హతం!

image

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో నేర నియంత్రణ శాఖ(CCD) డెత్ స్క్వాడ్‌లా మారింది. 2025లో ఏర్పాటైన ఈ విభాగం ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఏకంగా 670 ఎన్‌కౌంటర్లు చేసింది. పోలీసు కాల్పుల్లో 924 మంది చనిపోయారు. ఇద్దరు పోలీసులు చనిపోయారని రికార్డుల్లో పేర్కొన్నారు. పాక్ మానవ హక్కుల కమిషన్ ఈ వివరాలు వెల్లడించింది. 8 నెలల్లో సగటున రోజూ 2 కంటే ఎక్కువ ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయని, ఒక్క లాహోర్‌లోనే 139 జరిగాయని చెప్పింది.

News February 21, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 21, 2026

వెనక్కి తగ్గేది లేదు: ట్రంప్

image

తాను విధించిన టారిఫ్స్‌ను <<19195677>>రద్దు చేస్తూ<<>> సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఈ నిర్ణయం తీవ్ర నిరాశపరిచిందని, కొంత మంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు ప్రభావితమయ్యారని ఆరోపించారు. కోర్టులోని కొంతమంది సభ్యులను చూసి సిగ్గుపడుతున్నానని ఫైరయ్యారు. వాణిజ్య ఎజెండా నుంచి వెనక్కి తగ్గేది లేదని, ఇంకా బలమైన పద్ధతులు తనకు తెలుసని హెచ్చరించారు.