News September 8, 2025
‘దానం’ డిస్‌క్వాలిఫికేషన్ ఎపిసోడ్.. కాంగ్రెస్ ప్లాన్- బీ?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు తప్పించేందుకు కాంగ్రెస్ ప్లాన్-బీ రచిస్తున్నట్లు సమాచారం. దానంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులతో అధిష్ఠానం చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంపై గాంధీ భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
Similar News
News September 9, 2025
HYD: లా సెట్ 2వ దశ ప్రవేశాల షెడ్యూల్ ఖరారు

లా కోర్సుల్లో ప్రవేశాలకు రెండో దశ ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ఆప్షన్ల ఎంపికకు షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 14న వెరిఫికేషన్ వివరాలను వెల్లడిస్తామన్నారు. 15 నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని, 17న ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను 22న విడుదల చేస్తామని పేర్కొన్నారు.
News September 9, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 19 రోడ్డు ప్రమాదాలు: ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 19 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడిపిన 3,124 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 9, 2025
10 పోస్టులకు APPSC నోటిఫికేషన్

AP: అటవీ శాఖలో 10 ఠాణేదార్ (అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌తో సమానం)పోస్టులకు APPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1 వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ ఉంటుందని, త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని APPSC పేర్కొంది. పూర్తి వివరాలు, ఎగ్జామ్ సిలబస్ కోసం ఇక్కడ <