News October 12, 2025
దామన్న కుటుంబానికి అండగా ఉంటాం: CM రేవంత్

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి అవసరమైన సమయంలో రాజకీయంగా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుంగతుర్తిలో దామన్న సంతాప సభలో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటే RDRకు అమితమైన ప్రేమ అని కొనియాడారు. కాంగ్రెస్ అధిష్టానం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు, MLAలు, MLCలు పాల్గొన్నారు.
Similar News
News October 12, 2025
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోనున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. అట్లీ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న AA22 కోసం ఆయన ఏకంగా రూ.175 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభాస్ కొన్ని సినిమాలకు రూ.150 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నాయి. దీంతో రాబోయే సినిమాలతో ఐకాన్ స్టార్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
News October 12, 2025
VZM: 14న తెప్పోత్సవం.. రేపు ట్రయిల్ రన్..!

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవం పురస్కరించుకొని తెప్పోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈనెల 14న సాయంత్రం పట్టణంలోని పెద్ద చెరువులో తెప్పోత్సవం కనులపండువగా జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు పెద్ద చెరువులో తెప్పోత్సవ ట్రయిల్ రన్ నిర్వహించనున్నట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి.
News October 12, 2025
అర్ధరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది: మమత

MBBS స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ ఘటనపై బెంగాల్ CM మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలేజీ నుంచి అర్ధరాత్రి 12.30గం.కు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘మణిపుర్, బిహార్, UP, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.