News February 14, 2025

దామరగిద్ద: జపాన్‌లో ప్రదర్శనకు ఎంపిక విద్యార్థి ఆవిష్కరణ

image

దామరగిద్ద గురుకుల పాఠశాలకు చెందిన శివారెడ్డి తయారు చేసిన కోకోనట్ ఫైబర్ పాట్స్ ప్రాజెక్టును డిల్లీలో జరిగిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిట్స్ జపాన్‌లో జరిగే సకురా ప్రోగ్రామ్‌కు ఎంపికైనట్లు గైడ్ టీచర్ జరీనా బేగం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు విద్యార్థిని, గైడ్ టీచర్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులు ఎంపికైనట్లు చెప్పారు.

Similar News

News February 19, 2025

టీమ్ ఇండియా ఆ పాక్ ఆటగాడితో జాగ్రత్తగా ఉండాలి: హర్భజన్

image

పాక్ ఆటగాడు ఫకర్ జమాన్‌తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించారు. ‘భారత్‌పై జమాన్ రికార్డు చాలా బాగుంది. గతంలో మన విజయావకాశాల్ని అతడు దెబ్బకొట్టాడు’ అని గుర్తుచేశారు. భారత్‌పై 6 మ్యాచులాడిన జమాన్ 46.80 సగటుతో 234 రన్స్ చేయడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల సమరం ఈ నెల 23న జరగనుంది.

News February 19, 2025

తిరుపతి జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

తిరుపతి జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

News February 19, 2025

కులంలోనే కాదు.. మతంలోనూ పేదరికం ఉంది: షబ్బీర్ అలీ

image

TG: మైనారిటీలను BCల్లో కలిపారంటూ BJP చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ‘వెనుకబడిన మైనార్టీలు ఇప్పటికీ BC జాబితాలో ఉన్నారు. కులంలోనే కాదు మతంలోనూ పేదరికం ఉంది. పిలిస్తే బీజేపీ ఆఫీస్‌కు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తా. వెనుకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా వెనుకబడిన తరగతులే. బీసీలపై BJPకి అంత ప్రేమ ఉంటే బీసీ కులగణన చేయించాలి’ అని డిమాండ్ చేశారు.

error: Content is protected !!