News February 19, 2025
దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పరిసరాలు, వంటగది, తరగతి గదులు, మరుగు దొడ్లు పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తనిఖీ చేశారు. నెలలోపు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Similar News
News December 26, 2025
NLG: రైతన్నకు ‘యాప్‘ సోపాలు..!

జిల్లాలో రైతన్నలకు ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’తో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో యాసంగిలో 6.57 లక్షల ఎకరాల్లో అధికారులు సాగు అంచనా వేశారు. జిల్లాలో ఎరువులను అందుబాటులో ఉంచాల్సిందిపోయి. ఈ కొత్త యాప్ పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రారంభించిన తొలిరోజు నుంచి సరిగ్గా పనిచేయకపోవడంతో యాసంగిలో కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.
News December 26, 2025
NLG: సీఎం ప్రకటన.. సర్పంచులకు ఊరట!

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,779 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనున్నది.
News December 26, 2025
NLG: నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళింది అప్పుడే..!

పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో హనుమంతు (గణేష్) మొదటివారు. ఆయన 1960లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన హనుమంతు నల్గొండలో డిగ్రీ చేస్తూ రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ అనే ఏబీవీపీ నాయకుని హత్యలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నక్సలైట్ ఉద్యమంలో చేరారు.


