News April 5, 2025
దామెర: తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె..!

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధి లాదెల్ల గ్రామంలో లాదెల్ల బిక్షపతి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. భిక్షపతికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు లేకపోవడంతో కుమారుడి బాధ్యత పెద్ద కుమార్తె అయిన శోభారాణి తీర్చారు. మృతుడి దహన సంస్కారాలకు హాజరైన బంధుమిత్రులు, గ్రామ ప్రజలు శోభారాణి తలకొరివి పెట్టడం చూసి కన్నీరు మున్నీరయ్యారు.
Similar News
News April 6, 2025
కోడుమూరు: యువకుడిపై పోక్సో కేసు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికను నమ్మించి, మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రామాంజనేయులు అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన బాలికకు ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. ఆమెను మాయమాటలతో నమ్మించి, మోసం చేశాడు. తీరా ముఖం చాటేయడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి టౌన్ సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
News April 6, 2025
‘CID’ ACP ప్రద్యుమన్ పాత్ర ముగింపు.. షాక్‌లో ఫ్యాన్స్

ఫేమస్ హిందీ టీవీ షో ‘సీఐడీ’ తెలుగులోనూ చాలామందికి సుపరిచితమే. ఇందులో ప్రధాన పాత్రధారి ఏసీపీ ప్రద్యుమన్ మృతిచెందారని సోనీ టీవీ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన చాలామంది పాత్ర పోషించిన శివాజీ సాటమ్ చనిపోయారనుకుని పొరబడ్డారు. షో హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన శివాజీని ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓ ప్రముఖ నటుడు కొత్త ఏసీపీగా నటించనున్నట్లు సమాచారం.
News April 6, 2025
VZM: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

విజయనగరం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4న ఎల్.కోట మండలంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి 17 ఏళ్ల బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు.