News February 14, 2025

దామోదరయ్య చిత్రపటానికి కలెక్టర్ నివాళి

image

ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చిత్రపటానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ నివాళులర్పించారు. సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌వో విజయసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

గద్వాల్: మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు- SP

image

జిల్లాలో మహిళల, బాలికల రక్షణకై పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, తక్షణ స్పందనతో కాల్ చేసిన వారికి భరోసా, రక్షణ కల్పిస్తూ ఆకతాయిలకు చెక్ పెడుతుందని ఎస్పీ శ్రీనివాస రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312కు కాల్ చేసి సేఫ్‌గా ఉండాలని అన్నారు. మహిళలను, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 6, 2025

ఎల్లారెడ్డి: సలహాదారుడిని కలిసిన ఎమ్మెల్యే

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.

News November 6, 2025

మంచిర్యాల: కళ్లు దానం చేసిన ఎల్ఐసీ ఏజెంట్

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ఎల్ఐసీ ఏజెంట్ తన కళ్లను దానం చేశాడు. మంచిర్యాలకు చెందిన రాజన్న(56) నవంబర్ 1న ప్రమాదానికి గురయ్యాడు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. ఆయన చికిత్స పొందుతూ గురువారం మరణించగా కుటుంబ సభ్యులు ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంకుకు దానం చేశారు.