News November 7, 2025
దామోదరా.. ఎంజీఎం సంగతేంది..!

MGM ఖాళీలతో సతమతం అవుతోంది. మంత్రి దామోదర రాజ నర్సింహ కేవలం సూపరింటెండెంట్‌ను మార్చి, ఖాళీగా ఉన్న RMO పోస్టులను అత్యవసర విభాగం వారితో నడిపిస్తున్నారు. కొన్నేళ్లుగా RMO-1, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం మంగళవారం కల్పించిన పదోన్నతులతో ప్రస్తుతం విధుల్లో ఉన్న డిప్యూటీ RMO-2 ఎం.వసంతారావు సంగారెడ్డి(D) వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులయ్యారు. దీంతో ప్రస్తుతం 3 RMO పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Similar News
News November 7, 2025
విశాఖ కలెక్టరేట్లో వందేమాతరం వేడుకలు

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం వందేమాతరం గీతాన్న ఆలపించారు. బంకించందర చటర్జి వందేమాతరాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఉన్నతాధికారితో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతం స్వతంత్ర్య స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.
News November 7, 2025
శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి NOV 14-JAN 21 మధ్య 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లామ్, నర్సాపూర్-కొల్లామ్, చర్లపల్లి-కొల్లామ్ మధ్య ఈ ట్రైన్స్ నడుస్తాయని పేర్కొంది. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం పైన ఫొటోలను స్వైప్ చేయండి.
News November 7, 2025
కొత్తగూడెం: దివ్యాంగుల పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పురస్కారాల ప్రధానం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనిన్ తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వ్యక్తిగత, సంస్థాగత కేటగిరీ కింద ఈ పురస్కారాలు ఇస్తారని, అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.


