News October 3, 2025

దామోదర్ రెడ్డికి వీడ్కోలు ర్యాలీ

image

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఘనంగా కడసారి వీడ్కోలు పలికేందుకు నేడు సాయంత్రం 4 గంటలకు సూర్యాపేటలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కోర్టు, పోస్ట్ ఆఫీస్,పూల సెంటర్, పొట్టి శ్రీరాములు సెంటర్, రాఘవ ప్లాజా, నల్లలబావి, వాణిజ్య భవన్, శంకర్ విలాస్ సెంటర్,గాంధీ బొమ్మ, కొత్త బస్ స్టాండ్, ఖమ్మం క్రాస్ రోడ్డు,రెడ్ హౌస్ వరకు ర్యాలీ కొనసాగనుంది.

Similar News

News October 3, 2025

చంద్రముఖి, కాదంబినీ.. వీరి ప్రత్యేకత తెలుసా?

image

ఒకప్పుడు దేశంలో మహిళలు కట్టుబాట్ల పేరుతో ఎంతో వివక్షకు గురయ్యారు. అలాంటి కాలంలోనే పలువురు ధైర్యంగా ముందడుగు వేసి చరిత్రలో తమ పేజీని లిఖించుకున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన చంద్రముఖి బసు, కాదంబినీ గంగూలీ 1882లో కలకత్తా వర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మొదటి మహిళలుగా రికార్డు సృష్టించారు. వీరు భారత స్త్రీలకు విద్యారంగంలో మార్గదర్శకులుగా నిలిచారు.
<<-se>>#FirstWomen<<>>

News October 3, 2025

రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: KTR

image

TG: అరాచకత్వం, అనుభవలేమితో ఉన్న రేవంత్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సెప్టెంబర్‌లో GST వసూళ్లలో తెలంగాణ అట్టడుగున ఉండటం దారుణమని దుయ్యబట్టారు. రెండేళ్ల క్రితం KCR పాలనలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని గుర్తు చేశారు. తమ హయాంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలూ నేల చూపులే చూస్తున్నాయని మండిపడ్డారు.

News October 3, 2025

సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.