News December 22, 2025

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>దామోదర్ <<>>వ్యాలీ కార్పొరేషన్‌ 16 ఓవర్‌మెన్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా(మైనింగ్ Engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 55 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.45వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.dvc.gov.in

Similar News

News December 25, 2025

వంటింటి చిట్కాలు

image

* ఖీర్, పాయసం లాంటివి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* పకోడీలు కరకరలాడకపోతే బజ్జీల పిండిలో ఒకట్రెండు చెంచాల బియ్యప్పిండి కలిపి చూడండి.
* సెనగలను ఉడికించిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి వాడితే పోషకాలు అందుతాయి.

News December 25, 2025

జామలో కాయకుళ్లు తెగులు – నివారణ

image

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.

News December 25, 2025

సోషల్‌ మీడియా వాడేందుకు సైనికులకు అనుమతి?

image

భారత సైన్యం సోషల్ మీడియా నిబంధనలను సడలించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, X వంటి యాప్‌లను వాడేందుకు సైనికులు, అధికారులకు అనుమతి ఇచ్చినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. అయితే సమాచారం తెలుసుకోవడం, కంటెంట్ చూడటానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పోస్ట్, లైక్, కామెంట్ చేయడానికి పర్మిషన్ లేదని సమాచారం. హనీ ట్రాప్స్ వంటి ముప్పు నేపథ్యంలో భద్రతా నియమాలు పాటిస్తూనే ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలుస్తోంది.